Tejas: ఎట్టకేలకు తేజస్‌కు అమెరికా ఇంజన్లు
తేలికపాటి యుద్ధవిమానం తేజస్ (Tejas) ఎంకే-1ఏలో ఎంతో కీలకమైన ఎఫ్-404 ఇంజన్లు ఎట్టకేలకు అమెరికా (America) నుంచి రావడం మొదలైంది. ఈ యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఎఫ్-404 ఇంజన్లలో మొదటి దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) ( హాల్)కు పంపినట్టు అమెరికా రక్షణ రంగ కంపెనీ జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) వెల్లడించింది. భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) కోసం 88 తేజస్ మార్క్-1ఏ ఎయిర్‌క్రాఫ్ట్‌లు (Aircraft) కొనుగోలుకు 2021 ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ హాల్‌తో రూ.48 వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. గతేడాది మార్చిలోనే హాల్ వాటిని ఐఏఎఫ్‌కు అందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఒక విమానాన్ని కూడా డెలివరీ చేయలేదు. ఈ యద్దువిమానాల కోసం 99 ఇంజన్లు కావాలని జీఈ ఏరోస్పేస్‌కు హాల్ 2021లోనే ఆర్డర్ ఇచ్చింది. ఏటా కొన్ని చొప్పున అందించేలా ఒప్పందం కుదిరింది.






