New York :న్యూయార్క్‌లో కార్చిచ్చు
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌ను కార్చిచ్చు (Fire) పొగ కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతంలోని మిలిటరీ స్థావరాన్ని ఖాళీ చేయడంతో పాటు ప్రధాన రహదారిని మూసివేశారు. కార్చిచ్చు వేగంగా విస్తరిస్తుండటంతో న్యూయార్క్ గవర్నర్ కేతి హోచుల్ (Katie Hochul) అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్ నగరం తూర్పు భాగంలోని పెన్ బారన్స్ (Penn Barons) ప్రాంతాన్ని అగ్నికీలలు చుట్టుముడుతున్నాయి. కార్చిచ్చుకు కారణమైన 40 ఏళ్ల మహిళ అలగ్జాండ్రా బియాలోసో (Alexandra Bialoso)ను అధికారులు అరెస్టు చేశారు. దక్షిణ కరోలినా మైర్టిల్ బీచ్ ప్రాంతంలోని ఆమె ఇంటి వెనుక నుంచే తొలుత మంటలు వ్యాపించాయని, అవి క్రమంగా 2,059 ఎకరాలకు విస్తరించాయని అధికారులు తెలిపారు.






