Europe : ఐరోపా భద్రత కోసం స్పందిద్దాం : స్టార్మర్ పిలుపు
ఐరోపా భద్రత కోసం నడుం బిగిద్దామని, తరానికోసారి తలెత్తే ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరముందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ (Ukraine)కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకూ ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు లండన్ (London) లో జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ సమావేశాన్ని స్టార్మర్ ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో పాటు జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, ద చెక్ రిపబ్లిక్, రొమేనియా తదితర దేశాధినేతలు దీనికి హాజరయ్యారు. తుర్కియే విదేశాంగ మంత్రి, నాటో సెట్రకరీ జనరల్, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు వచ్చారు. వారంతా ఉక్రెయిన్‌కు మద్దతు పలికారు. కాల్పుల విరణమ కోసం ఐరోపా దళాలకు ఉక్రెయిన్‌కు పంపడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.






