Europe: అమెరికా వస్తువులపై ఐరోపా ప్రతీకార సుంకాలు
అమెరికా టారిఫ్లకు ఐరోపా(Europe) సమాఖ్య తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ (Washington) కు చెందిన 28.33 బిలియన్ డాలర్ల వస్తువులపై తాము ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఐరోపా కమిషన్ ప్రకటించింది. స్టీల్(Steel), అల్యూమినియమ్ (aluminum ) పై విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు అమెరికా ఉత్పత్తులపై ఉన్న టారిఫ్ల సస్పెన్షన్ను ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తున్నట్లు ఈయూ కమిషన్ (EU Commission) వెల్లడిరచింది. దీంతోపాట అమెరికా వస్తువులపై మరిన్ని చర్యలు తీసుకొంటామని చెప్పింది. ఈ చర్యలు అమెరికా నిర్ణయానికి సరిపోయతాయని వెల్లడిరచింది. మా ప్రతిఘటన చర్యలు రెండు దశల్లో అమలవుతాయి. ఏప్రిల్ 1వ తేదీన మొదలై, 13వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. అర్థవంతమైన చర్చలకు సిద్ధమే. దీనికి సంబంధించిన బాధ్యతలను ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్కు అప్పగించాను. వారు అమెరికాతో చర్చలు జరిపి మెరుగైన పరిష్కారం కొనుగొంటారు అని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లెయెన్ వెల్లడిరచారు. సుంకాలు వ్యాపారానికి, వినియోగదారులకు చాలా నష్టదాయకమని ఆమె అభిప్రాయపడ్డారు.






