ఎలాన్ మస్క్ ఆకస్మిక చైనా పర్యటన
అమెరికన్ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఆకస్మికంగా చైనా సందర్శించారు. ఆయన చైనా ప్రధాని లీ కియాంగ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలు వెల్లడి కాలేదు. అయితే చైనా ప్రభుత్వానికి చెందిన భవనాలు, ఎగ్జిబిషన్ కేంద్రాల వద్ద టెస్లా కార్ల పార్కింగ్‌ను నిషేధిస్తూ విధించిన ఆంక్షలను తొలగించమని ఆయన చైనా ప్రధానిని కోరినట్లు సమాచారం. దీనికి తోడు స్వయం నియంత్రిత (అటానమస్ ) విద్యుత్ కార్లను చైనా మార్కెట్లో ప్రవేశ పెట్టే విషయం, చైనాలో టెస్లా కార్ల వ్యాపార విస్తరణ గురించి చర్చించినట్లు తెలిసింది. బిజీ షెడ్యూల్ పేరుతో గత వారం భరత పర్యటన రద్దు చేసుకున్న మస్క్ వారం తిరక్కుండానే ప్రైవేట్ విమానంలో చైనా పర్యటనకు వెళ్లడం విశేషం.






