Elon Musk : ఎలాన్‌మస్క్ కీలక నిర్ణయం…. ఎక్స్ ను
బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (X)ను విక్రయించినట్లు ప్రకటించారు. అయితే, అది బయటి వ్యక్తులకు కాదట. మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ ( ఏఐ) అంకుర సంస్థ ఎక్స్ఏఐ (XAI) కే విక్రయించారు. 33 బిలియన్ డాలర్లకు ఎక్స్‌ను అమ్మివేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్ఏఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని ఎక్స్‌కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు (Best results) రాబట్టవచ్చని మస్క్ పేర్కొన్నారు.






