నాపైనా రెండు సార్లు హత్యాయత్నాం : మస్క్ వెల్లడి
గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ వెల్లడించారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధానా కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ వ్యక్తిగత భద్రతపై ఆయన సొంత సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఓ యూజర్ దయచేసి మీకున్న భద్రతా ఏర్పాట్లను మూడింతలు పెంచుకోండి. ఇవాళ ట్రంప్, రేపు మీ వంతు రావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ నిజమే, ప్రమాదం పొంచి ఉంది. గత ఎనిమిది నెలల్లో నన్ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. తుపాకీలతో సహా వారిని అరెస్ట్ చేశారు అని తెలిపారు. ఏ సమయం లోనైనా తాను హత్యకు గురి కావచ్చునంటూ గతంలోనూ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.






