తెలుగు తేజం సతీశ్ కత్తులకు అరుదైన గౌరవం
అమెరికా క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ సతీశ్ కత్తులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న తొలి తెలుగువాడిగా ఆయన ఘనత సాధించారు. వాషింగ్టన్ సెనేట్ భవనంలో జోయ్ మంచిన్ చేతుల మీదుగా సతీశ్ కత్తుల ఈ అవార్డును స్వీకరించారు. అమెరికాను ఆరోగ్యవంతమైన దేశంగా మలిచేందుకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నందుకు సతీశ్‌కు ఈ అవార్డు దక్కింది. సతీశ్ కత్తుల తెలంగాణకు చెందిన వారు. 29 ఏళ్లుగా ఆయన అమెరికాలో సేవలందిస్తున్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.






