డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర!
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం ప్రకటించింది. ఈ విషయమై జాతీయ నిఘా వర్గాలు ట్రంప్‌ను హెచ్చరించినట్లు పేర్కొంది. అమెరికాలో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది అని ట్రంప్ ప్రచార బృందం తెలిపింది. కొన్ని నెలులగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది. ట్రంప్ రక్షించడంతో పాటు ఎన్నికలపై ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని వెల్లడిరచింది.






