తెలుగమ్మాయి దీప్తి … ప్రపంచ రికార్డు
తెలుగమ్మాయి జీవాంజి దీప్తి విశ్వ వేదికపై సంచలన ప్రదర్శనతో మెరిసింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో రికార్డుతో స్వర్ణం పతకం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్ విభాగం రేసును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో గతేడాది అమెరికా అథ్లెట్ బ్రిన్నా క్లార్క్ నెలకొల్పిన ప్రపంచ రికార్డు (55.12సె.) దీప్తి బద్దలుకొట్టింది. ఐసెల్ ఒండర్ (టర్కీ-55.19)కు రజతం, లిజాంషెలా అంగులో (ఈక్వెడార్-56.68 సె)కు క్యాంస పతకాలు దక్కాయి. అంతుకుమందు రోజు దీప్తి హీట్స్‌లో 56.18 సెకన్లలో ఆసియా రికార్డు టైమింగ్‌ను నమోదు చేసి ఫైనల్స్‌కు క్యాలిఫై అయింది. ఈ టోర్నీలో విజయంతో దీప్తి త్వరలో జరిగే పారిస్ పారాలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.






