బ్రిటన్ ప్రధాని రిషి సునాక్… క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటు చేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ క్షమాపణలు తెలిపారు. బ్రిటన్ చరిత్రలో సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజని వ్యాఖ్యనించారు. ప్రస్తుత ప్రభుత్వం తో పాటు 1970ల నుంచి ఏర్పడిన అన్ని ప్రభుత్వాల తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఖర్చు ఎంతైనా సరే పరిహారం అందజేస్తాం అని ఈ కుంభకోణం బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఉద్దేశించి ప్రతినిధుల సభలో మాట్లాడుతూ వెల్లడిరచారు.






