దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రామఫోసా ప్రమాణ స్వీకారం
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి సిరిల్ రామఫోసా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి రేమండ్ జోండో ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రామఫోసా నేతృత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) మెజారిటీ సాధించడంలో 30 ఏళ్లలో తొలిసారి విఫలమైంది. దీంతో డెమోక్రటిక్ ఆలయెన్స్ (డీఏ) సహకారంతో రామఫోసా సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఏఎన్‌సీకి 40 శాతం, డీఏకు 22 శాతం ఓట్లు వచ్చాయి.






