KL Rahul: సెల్ఫ్ లెస్ క్రికెటర్, కీర్తిస్తున్న ఫ్యాన్స్
టీమిండియా.. స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) విషయంలో ఇప్పుడు అభిమానులు మదన పడుతున్నారు. రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ తో పాటుగా పరుగుల విషయంలో రాహుల్ చేస్తున్న త్యాగాలు కూడా అభిమానులను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఇతర ఆటగాళ్లు సెంచరీలు, అర్ధ సెంచరీల కోసం కేఎల్ రాహుల్ స్లోగా ఆడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఆట తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అర్థ సెంచరీ చేసే అవకాశం ఉన్నా సరే కే ఎల్ రాహుల్ మాత్రం చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. గిల్ సెంచరీ చేసే అవకాశం ఉండటంతో ఎక్కువగా పరుగులు చేయడానికి రాహుల్ ఇష్ట పడలేదు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కూడా రాహుల్ ఇలాగే నిదానంగా పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్లో తక్కువ పరుగులకే రాహుల్ అవుట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బంగ్లాదేశ్ లో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో శుభమన్ గిల్ అదరగొట్టాడు. అయితే ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా గిల్ మాత్రం సహనంగా బ్యాటింగ్ చేశాడు.
ఈ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ ఎక్కడా తడబడకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ గిల్ పరుగులు చేసేందుకు అవకాశం కల్పించాడు. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏమాత్రం స్వార్థం లేకుండా ఆడగలిగే క్రికెటర్లలో కె.ఎల్ రాహుల్ ముందు ఉంటాడని.. గతంలో కూడా విరాట్ కోహ్లీ(Virat Kohli) సహా పలువురు ఆటగాళ్ల సెంచరీల కోసం తను అర్థం చేసుకున్నాడని.. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడే ఆటగాడు కాదంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.






