Costa Rica :అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలిస్తున్న అమెరికా!
అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారత్ అక్రమ వలసదారులనను తమ దేశంలోకి తీసుకొంటున్నట్లు కోస్టారికా (Costa Rica) ప్రకటించింది. దీనిపై ఆ దేశాధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ.. 200 మంది వలసదారులతో విమానం బుధవారం మా దేశానికి చేరుతుంది. వీరంతా మధ్య ఆసియా(Asia), భారత్ (India) కు చెందినవారు అని పేర్కొంది. వీరందరినీ కమర్షియల్ ఫ్లైట్లో అక్కడికి తరలిస్తున్నారు. పనామా(Panama) సమీపంలో ఏర్పాటు చేసిన వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరిని తరలించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తానికి అమెరికా(America)నే సొమ్ములు చెల్లిస్తుంది. దీనిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ పర్యవేక్షించనుందని కార్యాలయం తెలిపింది.






