Friedrich Merz: జర్మనీ ఛాన్స్లర్గా ఫ్రెడరిక్ మెర్జ్
జర్మనీ ఛాన్స్లర్గా మితవాద నేత ఫ్రెడరిక్ మెర్జ్ (Friedrich Merz) ఎన్నికయ్యారు. దేశ దిగువ సభ బుందెస్టాగ్ (Bundestag) లో జరిగిన ఎన్నికలో తొలుత ఆయన ఓటమి పాలైనా తరువాత కొన్ని గంటలకే మళ్లీ జరిగిన ఓటింగులో విజయం సాధించారు. ఆనవాjయితీ ప్రకారం జర్మనీ దేశాధ్యక్షుడు (German President) బుందెస్టాగ్లోని పార్లమెంటరీ పార్టీలన్నింటినీ సంప్రదించాక ఛాన్స్లర్ పదవికి అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన అభ్యర్థి బుందెస్టాగ్లోని మొత్తం 630 మంది సభ్యులకుగాను 316 మంది మద్దతు పొందాలి. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ (Ballet) పద్ధతిలో జరుగుతుంది. ఈసారి అధ్యక్షుడు ఛాన్స్లర్గా అభ్యర్థిగా ప్రకటించిన ఫ్రెడరిక్ మెర్జ్ తొలుత 310 ఓట్లే పొందగలిగారు. రెండో సారి జరిగిన ఓటింగులో ఆయన 325 ఓట్లు పొందారు. మెర్జ్కు చెందిన కూటమిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (Democratic Union), క్రిస్టియన్ సోషల్ యూనియన్ పార్టీలు ఉండగా ఈ కూటమికి సోషల్ డెమోక్రాట్లు మద్దతు ప్రకటించారు. ఈ మూడు పార్టీలకూ కలిపి సభలో మొత్తం 328 స్థానాలున్నాయి.







