ఏఐతో సెక్స్ డాల్స్ తయారు చేస్తున్న చైనా
శారీరక అవసరాలు తీర్చే సెక్స్ డాల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) ను జత చేసి సెక్స్ రోబోలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. శరీర వాంఛలను తీర్చడంతో పాటు మాట్లాడ గలిగేలా వీటిని తయారు చేస్తున్నారు. షెన్ జెన్‌కు చెందిన స్టార్‌పెరీ టెక్నాలజీ అనే సెక్స్ డాల్స్ తయారీ సంస్థ ఈ కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురానున్నది. మగ, ఆడ రూపాల్లో వీటిని తయారు చేస్తున్నట్లు తెలిసింది. శారీరక అవసరాలు తీర్చడంతో పాటు వినియోగదారులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండేలా ఈ కొత్త ఏఐ ఆధారిత సెక్స్ డాల్స్‌ను తయారు చేస్తున్నట్లు స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈవో ఈవాన్ లీ తెలిపారు.






