America: అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి!
అమెరికా టారిఫ్‌లపై ప్రతిస్పందించేందుకు చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫెంటానిల్ ఎగుమతులకు ప్రతిగా తాము చైనా (China)పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్‌పింగ్ (Jinping ) సర్కారు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు, టారిఫేతర చర్యలకు సిద్ధమైంది. చైనా లక్ష్యాల్లో అమెరికా వ్యవసాయ, ఆహారోత్పత్తులు ఉండే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ (Global Times) పేర్కొంది. వ్యవసాయోత్పతుల విషయంలో అమెరికాకు చైనా అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. అప్పట్లో సోయాబీన్, బీఫ్, పోర్క్, గోధమ, మొక్కజోన్న వంటి వాటిపై 25 శాతం సుంకాలు విధించింది. దీంతో మెల్లగా ఆ మార్కెట్‌పై అమెరికా పట్టు కోల్పోతూ వస్తోంది. ఇక 2024లో అమెరికా నుంచి 29.25 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసింది.






