అమెరికా పై చైనా విమర్శలు …

తైవాన్ జలసంధిలో అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధ నౌక ప్రవేశించడాన్ని కవ్వింపు చర్యగా చైనా పేర్కొంది. సున్నితమైన తైవాన్ జలసంధిలో శాంతికి విఘాతం కలిగించేలా ఈ కవ్వింపు చర్యలకు అమెరికా పాల్పడిందని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా యూఎస్‍ఎస్ కర్టిస్ విల్పర్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక తైవాన్ జలసంధిలో రొటీన్‍గానే పయనించినట్లు అమెరికన్ నావికాదళానికి చెందిన సప్తమాంగదళం పేర్కొంది. అమెరికా ఉద్దేశ్వపూర్వకంగానే ప్రాంతీయ ఉద్రికత్తలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.