Donald Trump: డొనాల్డ్ ట్రంప్ వద్దన్నా … ఇతర మార్గాలున్నాయ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలతో మత్స్య రంగంపై పడిన ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, కొత్త మార్కెట్ల విస్తరణపై దృష్టి సారించినట్లు జాతీయ మత్స్యఅభివృద్ధి మండలి (ఎన్‌ఎఫ్‌డీబీ) సీఈవో బిజయ్‌కుమార్ బెహర్ (Bijay Kumar Behar) తెలిపారు. హైదరాబాద్‌లో రొయ్యలు, చేపల రిటైల్ -2025 జాతీయ సదస్సుకు హాజరైన ఆయన దేశీయ మత్స్య పరిశ్రమ స్థితిగతులు, ఎగుమతులు, రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, వాటి పరిష్కార మార్గాలపై బెహర్ మాట్లాడారు. చైనా(China) , ఆస్ట్రేలియా, బ్రిటన్ (Britain) , జపాన్, సౌదీ అరేబియా(Saudi Arabia) లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని, తద్వారా ఎగుమతులను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా మార్కెట్ వృద్ధి చేయడం ద్వారా చేపలు, రొయ్యల వినియోగం పెంపునకు కృషి చేస్తోందని వివరించారు.