America: అమెరికాలో మరోమారు కలకలం

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఓ కుటుంబంలో తగాదా రేగినట్టు ఫిర్యాదు అందడటంతో వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులు (Police) మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఫిలడెల్ఫియాకు పశ్చిమాన సుమారు 115 మైళ్ల దూరంలో ఉన్న నార్త్ కొరొడస్ టౌన్‌షిప్‌లో ఈ దారుణం జరిగింది. గాయపడ్డ పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానిక యార్క్ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.అయితే, నిందితుడి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. మృతి చెందిన పోలీసులు ఏ విభాగానికి చెందిన వారో కూడా తెలపలేదు. కాల్పులకు గల కారణం కూడా తెలియాల్సి ఉంది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడించేందుకు కొంత సమయం పడుతుందని పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసు కమిషనర్ క్రిస్టఫర్ పారిస్ (Christopher Paris) వెల్లడించారు.