China :రక్షణ బడ్జెట్ను భారీగా పెంచనున్న చైనా!
చైనా తన రక్షణ బడ్జెట్ (Defense budget )ను భారీగా పెంచే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. గతేడాది 232 బిలియన్ డాలర్ల మేర రక్షణ బడ్జెట్ను ప్రకటించిన డ్రాగన్ ఈసారి దాన్ని మరింత పెంచేందుకు సిద్ధమైంది. శక్తిసామర్థ్యాల ద్వారానే శాంతి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చని చైనా (China) అభిప్రాయపడిరది. ప్రధాని లీ కియాంగ్ (Lee Kiang) ప్రధాన బడ్జెట్ను పార్లమెంటు (Parliament)లో ప్రవేశపెట్టనున్న వేళ రక్షణ బడ్జెట్ పెంపు సమాచారం బయటకు వచ్చింది. చైనా తన సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. ఎయిర్క్రాఫ్టు (Aircraft)ల తయారీ, అత్యాధునిక సాంకేతిక కలిగిన యుద్ధ నౌకల నిర్మాణంతో సాయుధ దళాలను ఆధునీకరించే పనిలో పడిరది. ఇందుకోసం ఏటా భారీగా ఖర్చు పెడుతోంది. గతేడాది 232 బిలియన్ డాలర్లతో రక్షణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అంతుకుమందు ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎక్కువ.






