China: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్
ఎగిరే ట్యాక్సీల విషయంలో చైనా (China) కీలక ముందడుగు వేసింది. పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ ట్యాక్సీల (Flying taxi ) ను కమర్షియల్గా వినియోగించేందుకు అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా అనుమతిచ్చింది. ఈహ్యాంగ్ హోల్డింగ్స్, హేఫీ హే ఎయిర్లైన్స్ సంస్థలకు ఈ మేరకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ను జారీ చేసింది. అర్బన్ ఏరియాల్లో పర్యటక స్థలాల సందర్శనకు ప్రయాణికుల డ్రోన్లను వినియోగించుకునేందుకు అనుమతించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలు (Air taxis) రివ్వున గాల్లోకి ఎగరనున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), 6జీ నెట్వర్క్ వంటి వాటితో పాటు తక్కువ ఎత్తుల్లో ఎగిరే డ్రోన్లు (Drones), బ్లింప్స్ (గాలితో నిండిన బెలూన్లు) ఫ్లయింగ్ కార్లను చైనా ప్రమోట్ చేస్తోంది.






