America : అమెరికా బ్లాక్మెయిల్ కు పాల్పడుతోంది : చైనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా చైనా (China) కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఫెంటనిల్ అంశాన్ని వాడుకుంటూ సుంకాల పేరుతో ఒత్తిడి చేయడంతోపాటు బ్లాక్మెయిల్ (Blackmail) కు పాల్పడుతోందని ఆరోపించింది. చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్ ఈ విధంగా స్పందించింది. టారిఫ్ ఒత్తిడిలు, బ్లాక్మెయిల్ కోసం ఫెంటనిల్ అంశాన్ని అమెరికా వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ఒత్తిడి, నిర్బంధం, మాదకద్రవ్యాల నియంత్రణలో ఇరుదేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతుంది అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ (Lin Jiang పేర్కొన్నారు. అయితే, పరిస్థితులు మారకుంటే ఈ చర్యలకు ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు.






