భారత్ లోనే కాదు.. అమెరికాలోనూ
భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఎండలు మండిపోతున్నాయి. అమెరికాలో సోమవారం 7.5 కోట్ల మందకి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం షికాగో సహా పలు నగరాలు భానుడితాపానికి అల్లాడిపోయాయి. షికాగోలో సోమవారం 36.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వారం 37.7 డిగ్రీలను కూడా చవిచూసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫినీక్స్ పట్టణంలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిరుడు ఇక్కడ ఉష్ణ తాపానికి 645 మంది మరణించారు. జనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో బయట తిరిగే సమయాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని వాతావరణ శాస్త్రవేత్త టెడ్ విట్ లాక్ సూచించారు. ఫినీక్స్ పట్టణంలో 100 శీతల కేంద్రాలను తెరిచారు. పొరుగునే ఉన్న రాస్ వెల్‌లో సోమవారం ఉష్ణ్రోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. దక్షిణ కొలరాడో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలకు చేరింది.






