Jaishankar :అదే ఇప్పుడు వారి పాలిట శాపమైంది : జైశంకర్
పాకిస్థాన్‌పై భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) మరోసారి విరుచుకుపడ్డారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని క్యాన్సర్ వ్యాధితో పోల్చిన ఆయన పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశ ప్రజలనే కబళిస్తోందని విమర్శించారు. దాయాదిపై విమర్శలు గుప్పించారు. మన పొరుగున ఉన్న పాకిస్థాన్ (Pakistan)సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అదే ఇప్పుడు వారి పాలిట శాపమైంది. అది క్రమంగా ఆ దేశ రాజకీయాల్లోకీ ప్రవేశిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయి అని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి వెనుకబాటుకు తావివ్వకూడదని సూచించారు. పాశ్చాత్య విధానానికి భారత్ (India ) వ్యతిరేకమైనప్పటికీ, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మద్దతిస్తుందని పేర్కొన్నారు. ఆయుధీకరణ విషయంలో భారత్ స్వావలంబన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు.






