Jagmeet Singh : ట్రంప్‌ను కెనడాలోకి రానీయొద్దు : జగ్మీత్ సింగ్
కెనడా ప్రతిపక్ష ఎన్డీపీ ( నేషనల్ డెమోక్రటిక్ పార్టీ) నేత, ఖలిస్థానీ సానుభూతిపరుడు జగ్మీత్ సింగ్ (Jagmeet Singh) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ను నేరస్థుడిగా అభివర్ణించారు. ఆయనను జి-7 సదస్సు (G-7 Summit) కోసం కెనడా భూభాగంపై అడుగు పెట్టనీయకుండా నిషేధం విధించాలని డిమాండు చేశారు. ట్రంప్‌పై గతంలో నేర నిర్ధారణ జరిగిన అంశం, ప్రపంచ దేశాలకు ఆయన బెదిరింపులను ఇందుకు ఓ కారణంగా పేర్కొన్నారు. జగ్మీత్ సింగ్ మాంట్రి యాల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సింగ్ ప్రకటనపై ఇప్పటివరకు కెనడా ప్రభుత్వం (Government of Canada) స్పందించలేదు. ప్రధాని కార్యాలయ ప్రతినిధి సైమన్ లాఫార్చ్యూ (Simon Lafortue) స్పందిస్తూ దీనిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని వెల్లడిరచారు.






