Justice Trudeau: వీడ్కోలు సభలో కెనడా ప్రధాని ట్రూడో కంట నీరు
కెనడా ప్రధానిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న జస్టిస్ ట్రూడో (Justice Trudeau) వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి లోనయి కన్నీటిపర్వంతమయ్యారు. కెనడా వాసులను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి రోజూ కృషి చేశానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) విధానాలను విమర్శిస్తూ అంతర్జాతీయ సంబంధాలంటే రియల్ ఎస్టేట్ డీల్స్ కాద ని వ్యాఖ్యానించారు. లిబరల్ పార్టీ (Liberal Party ) లోని అంతర్గత కుమ్ములాటలు, ప్రజాదరణ రేటింగ్స్ తగ్గిపోవడంతో ట్రూడో జనవరి నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇంతవరకు ఆపద్ధర్మ ప్రధానిగా విధులు నిర్వరిస్తున్నారు. పదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండడం గమనార్హం. లిబరల్ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకోన్ను నేపథ్యంలో ట్రూడోకు వీడ్కోలు పలికారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా(Canada) పై అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో ట్రూడో చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకొంది.






