Canada : భారతీయులకూ ఊరట … వీసా నిబంధనలు సడలించిన కెనడా
కెనడా (Canada) లోని అంతర్జాతీయ విద్యార్థులు (Students), ఉద్యోగుల భాగస్వాములకు ఇచ్చే ఓపెన్ వర్క్ పర్మిట్ల (ఓడబ్ల్యూపీ) వీసా (VISA) నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. నిబంధనలకు లోబడి అర్హులైన భాగస్వాములు జనవరి 21వ తేదీ నుంచి వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కెనడా ఆర్థికవ్యవస్థ, కార్మిక శక్తికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేల మంది భారతీయులకూ ప్రయోజనం కలగనున్నట్లు తెలుస్తోంది. పదహారు నెలలు అంతకంటే ఎక్కువ కాల పరిమితి ఉన్న మాస్టర్స్, పరిశోధక లేదా ఎంపిక చేసిన ప్రొఫెషనల్ కోర్సుల్లో నమోదు చేసుకున్న వాళ్లు కుటుంబికులకే ఈ సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగుల విషయానికొస్తే, ఓడబ్ల్యూపీ (OWP) కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి ఉద్యోగి పని కాలపరిమితి కనీసం పదహారు నెలలు మిగిలి ఉండాలి. అయితే. విదేశీ కార్మికులపై ఆధారపడిన పిల్లులు మాత్రం ఇందుకు అర్హులు కాదు. అయినప్పటికీ, మునుపటి నిబంధనల ప్రకారం ఆమోదం పొందిన వారు మాత్రం రెన్యువల్ చేసుకొని దానిని కొనసాగించవచ్చు.






