California: ఏఐ చాట్‌బాట్‌లపై కాలిఫోర్నియాలో చట్టం

అమెరికాలో తొలిసారి ఏఐ చాట్‌బాట్‌లపై కాలిఫోర్నియా నగరం కొత్త చట్టం తెచ్చింది. ఏఐ కంపానియన్ చాట్‌బాట్‌లను నియంత్రించే చారిత్రక చట్టాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఆమోదించారు. మెటా (Meta), ఓపెన్ఏఐ (OpenAI), క్యారెక్టర్ ఏఐ (Character AI), రెప్లికా (Replika) వంటి టూల్స్ నుంచి పిల్లలు, సున్నితమైన యూజర్లను రక్షించడానికి కొత్తగా సేఫ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరి చేస్తూ ఈ చట్టాన్ని తెచ్చారు.
ఇటీవల చాట్‌జీపీటీ (ChatGPT)తో ఆత్మహత్య గురించి మాట్లాడిన ఒక టీనేజర్ సూసైడ్ చేసుకోవడంతో ఈ చట్టం తెచ్చినట్లు సమాచారం. అలాగే మెటా (Meta) చాట్‌బాట్‌లు పిల్లలతో “రొమాంటిక్” చాట్‌లు చేస్తున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త చట్టం 2026 జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది.