ఎస్‌యూవీపై లండన్ నుంచి థాణేకు …16 దేశాల నుంచి 18.వేల కి.మీ. ప్రయాణం
భారత సంతతికి చెందిన బ్రిటిష్ దేశస్థుడు విరాజ్ ముంగానే భారత్‌లోని తల్లిని కలవడానికి ఏకంగా ఒక సాహసయాత్రే చేశాడు. తల్లిని కలవడానికి లండన్ నుంచి ఏకంగా ఎస్ యూవీ వాహనంలో బయలుదేరి విజయవంతంగానే థాణే చేరుకున్నాడు. ఈ క్రమంలో తన 59 రోజుల్లో 18,300 కి.మీ. ప్రయాణించి 16 దేశాలను సందర్శించాడు. వాటిలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోలాండ్, రష్యా, ఉజ్బెకిస్థాన్, చైనా, టిబెట్, నేపాల్ తదితర దేశాలు ఉన్నాయి. గతంలో పలువురు ఇలా చేసిన యాత్రలు తనలో స్ఫూర్తిని నింపాయని ఆయన చెప్పారు. రోజుకు 400`600 కి.మీ డ్రైవ్ చేసేవాడినని, అప్పుడప్పుడు 1,000 కి.మీ కూడా వెళ్లిన సందర్భాలున్నాయని తెలిపాడు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణం చేసేవాడిని కాదని, ఈ యాత్ర కోసం తన ఆఫీస్‌కి రెండు నెలలు సెలవు పెట్టానని, తాను ప్రయాణించే దేశాల్లో అనుమతులు ముందే తీసుకున్నానని తెలిపాడు.






