మస్క్ కు ఎదురుదెబ్బ.. బ్రెజిల్లో
ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికైన ఎక్స్‌ను దేశవ్యాప్తంగా నిషేధించాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని కమిటీ మొత్తంగా సమర్థించింది. బ్రెజిల్లో రాజకీయ ప్రసంగాలను సెన్సార్ చేయాలనే ఉద్దేశ్యంతో జస్టిస్ అలెగ్జాండ్రి డే మోరెస్‌ను నిరంకుశమైన తిరుగుబాటుదారునిగా చూపించేందుకు మస్క్ ఆయన మద్దతుదారులు చేసిన ప్రయత్నాలకు ఈ నిర్ణయంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చట్టం ప్రకారం స్థానిక చట్ట ప్రతినిధి పేరు వెల్లడిరచడానికి తిరస్కరించినందుకు మొత్తంగా ఎక్స్ వేదికను నిషేధించాలని గత వారం డీ మోరెస్ ఆదేశించారు. తన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే వరకు, బకాయిలను చెల్లించేవరకు ఈ సస్పెన్షన్‌ను కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఎక్స్ ఆయనతో విభేదించింది. ఈ నేథ్యంలో సుప్రీం కమిటీ నిర్ణయం వెలువడిరది.






