విద్యార్థులకు చైనా హెచ్చరిక…అలాంటి వారికి దూరంగా
తమ దేశ విద్యార్థులకు చైనా ప్రభుత్వ రంగ సెక్యూరిటీ ఏజెన్సీ కీలక సూచనలు చేసింది. అందమైన అబ్బాయిలు, అమ్మాయిల ట్రాప్ లోపడొద్దని హెచ్చరించిది. వారు విదేశీ గూఢచారులు అయి ఉంటారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు బీజింగ్ భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనీస్ విద్యార్థులను ఆకర్షించేందుకు కొన్ని విదేశీ నిఘా సంస్థలు రొమాన్స్ ట్రాప్ లను ఎంచుకుంటున్నాయి. మిమ్మల్ని వలలో వేసుకుని దేశ సున్నితమైన, రహస్య సమాచారాన్ని రాబట్టేందుకు విదేశీ గూఢచారులు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఉద్యోగాల ఆశ జూపి లేదా ఆన్లైన్ డేటింగ్ అంటూ యువ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా రీసెర్చ్ డేటా గురించి తెలిసిన విద్యార్థులను వారు లక్ష్యంగా చేసుకోవచ్చు. కొందరు ఆన్లైన్లో తమ పేర్లు, ముఖాలు మార్చుకుని రొమాంటిక్ ట్రాప్లోకి లాగే అవకాశం ఉంది. అందుకే అందమైన అబ్బాయిలు, అమ్మాయిలకు దూరంగా ఉండండి అని చైనా హెచ్చరించింది.






