Jinping : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో యూనస్ భేటీ
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping) బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా యూనస్ చైనాకు వెళ్లారు. హైనాన్ ప్రావిన్స్‌లో బోవో ఫోరమ్ ఫర్ ఆసియా వార్షిక సదస్సులో యూనస్ పాల్గొన్నారు. అనంతరం చైనా రాజధాని బీజింగ్ (Beijing) చేరుకొని, ఆ దేశ ప్రతినిధులతో సమావేశమయ్యారు. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజ్‌ను మాఫీ చేయాలని కోరారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు. జపాన్ (Japan) , ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత చైనా (China) దగ్గరినుంచే బంగ్లా ఎక్కువగా రుణాలు పొందుతోంది. 1975 నుంచి ఇప్పటివరకు పొందిన అప్పులు 7.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.






