Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం?
రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఉపయోగించే అత్యంత ఖరీదైన లిమోజీన్ (Limousine ) కారు మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. మాస్కో (Moscow) లో జరిగిన ఈ ఘటనను అధ్యక్షుడిపై హత్యాయత్నంగా భావిస్తున్నారు. అధ్యక్ష భవనం ఆస్తుల విభాగం నిర్వహించే ఈ కారు మంటల్లో కాలిపోయింది. దాని ఖరీదు 2,75,00 పౌండ్లు ( దాదాపు రూ. 3 కోట్లు పైగా). అది కాలిపోయిన సమయంలో అందులో ఎవరున్నదీ తెలియరాలేదు. మాస్కోలోని లుబ్యంకా(Lubyanka) లో ఉన్న జాతీయ భద్రత సర్వీస్ ప్రధాన కార్యలయం వద్ద ఈ నెల 29వ తేదీన తొలుత పేలుడు సంభింవించింది. ఆ తర్వాత దేశాధ్యక్షుడు ఉపయోగించే ఆరస్ లిమోజిన్ (Aurus Limousine) కారు మంటల్లో చిక్కుకుంది. సమీప బార్లలో ఉన్నవారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇంజిన్ నుంచి మంటలు కారు మెత్తానికి వ్యాపించినట్లు వీడియో పుటేజ్‌లో కనిపించింది. చివరకు కారు మొత్తం దగ్ఘమైంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున పొగ అలముకుంది. కారు దగ్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి భద్రతపై ఆందోళన నెలకొంది.






