ప్రముఖ రచయిత్రికి పెన్ పింటర్ పురస్కారం
నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకుగానూ బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌కు పెన్ పింటర్-2024 పురస్కారం దక్కింది. అక్టోబర్ 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేస్తారు. ఈ సందర్భంగా రాయ్ ప్రసంగం ఉంటుంది. ఇంగ్లిష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా, నోబెల్ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్ పింటర్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. తనకు పురస్కారం రావడం పట్ల రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం తీసుకుంటున్న అపారమైన మలుపలపై రచనలు చేయడానికి హరోల్డ్ పింటర్ మనతోనే ఉన్నారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.






