Anand Mahindra : తెలుగు ఐఏఎస్ అధికారిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) . ఈరోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్ను షేర్ చేశారు. యువ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ (Krishna Bhaskar) కథనాన్ని పంచుకున్న ఆయన ఆ అధికారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ (Agricultural ) రంగం గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. భూగర్భ జలాల స్థాయిలను పెంచడంలో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో మన అందరికీ బాగా తెలుసు. అలాంటి సమయంలో ఈ యువ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. సమస్య ఎలాంటిదైనా అన్ని అధిగమించగలని ఆయన మనలో విశ్వాసాన్ని నింపగలిగారు. దానికి కావాల్సిందల్లా దృఢ సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే ఆయనే నా మండే మోటివేషన్ (Motivation) అని మహీంద్రా ప్రశంసలు కురిపించారు.






