పాకిస్థాన్‌పై అమెరికా ఆంక్షలు
పాకిస్థాన్ క్షిపని తయారీ కార్యక్రమానికి అవసరమైన పరికరాలు, పరిజ్ఞానాలను అందించినందుకు నాలుగు చైనా సంస్థలు, ఒక చైనా పౌరుడు, ఒక పాకిస్థానీ కంపెనీ మీద అమెరికా ఆంక్షలు విధించింది. క్షిపణి పరిజ్ఞాన బదిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన చట్టాలను పై సంస్థలు ఉల్లంఘించినందున చర్య తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. దీర్ఘ శ్రేణి క్షిపణుల మోటార్లను పరీక్షించడానికి కావలసిన పరికరాలను పాక్ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ (ఎన్.డి.సి)కి చైనాకు చెందిన బీజింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ ఫర్ మెషీన్ బిల్డింగ్ ఇండస్ట్రీ సంస్థ అందించిందని ఆయన తెలిపారు. ఆ సంస్థపై రెండు అంతర్జాతీయ చట్టాల కింద ఆంక్షలు విధించామన్నారు. మరో మూడు చైనా సంస్థలపైనా, ఇనొవేటివ్ ఎక్విప్మెంట్ అనే పాక్ కంపెనీ మీద కూడా ఆంక్షలు విధించారు.






