Air India: అమెరికాకు రూటు మారుతోంది : ఎయిరిండియా
ఢల్లీి నుంచి ఉత్తర అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు, ప్రత్యామ్నాయ మార్గాలను ఎయిరిండియా (Air India) అన్వేషిస్తోంది. మనదేశంలోనే ఢల్లీి నుంచి మరో నగరానికి వచ్చి అక్కడ నుంచి అమెరికాకు బయలుదేరే అవకాశాలనూ పరిశీలిస్తోంది. తద్వారా పాకిస్థాన్ (Pakistan) గగనతల ఆంక్షల వల్ల, అధిక దూరం ప్రయాణించేందుకు అవుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారానికి 71 విమానాలను ఉత్తర అమెరికాకు ఎయిరిండియా నిర్వహిస్తోంది. అందులో 54 సర్వీసులు ఢల్లీి (Delhi )నుంచే వెళ్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం. విదేశీ టెక్-స్టాప్స్ సంఖ్య తగ్గించడం, మరిన్ని నాన్ సాఫ్ట్ సర్వీసులను త్వరలోనే పెంచుతామని ఎయిరిండియా ఎండీ, సీఈఓ తమ సిబ్బందికి పంపిన సమాచారంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ గగనతల మూసివేత వల్ల ఢల్లీి సహా ఉత్తర భారత నగరాల నుంచి అమెరికా వెళ్లే విమానాలన్నీ అరేబియా సముద్రం (Arabian Sea) మీదుగా, సుదీర్ఘ మార్గాల్లో వెళ్తున్నాయి. ఇందువల్ల ప్రయాణ సమయం వ్యయాలు అధికమవుతున్నాయి.







