హజ్ యాత్రలో విషాదం… 90 మంది భారతీయులే ?
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. ఇక ఇప్పటి వరకు 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. ఈజిప్ట్, జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు కాగా, 90 మందికి పైగా జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. అయితే, చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 68 మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల సంఖ్యపై సౌదీ అధికారులు గానీ, భారత ప్రభుత్వం గానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.






