Myanmar: సైబర్ నేరగాళ్ల నుంచి 549 భారతీయులకు విముక్తి
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోయిన 549 మంది భారతీయులను దేశానికి తీసుకొచ్చారు. మయన్నార్ (Myanmar )-థాయ్‌లాండ్ (Thailand) సరిహద్దుల్లో ఉన్న సైబర్ క్రైమ్ సెంటర్ల నుంచి రెండు సైనిక విమానాల్లో తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నకిలీ జాబ్ ఆఫర్లకు భారతీయులు (Indians) బలైపోయారని అధికారులు తెలిపారు. వీరంతా మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) , ఉత్తరప్రదేశ్ లకు చెందినవారని వెల్లడిరచారు. మయన్నార్ లోని మైవడి ప్రాంతంలో ఉన్న సైబర్ క్రైమ్ కేంద్రాలకు వీళ్లను తీసుకెళ్లారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు మయన్నార్, థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయాలు ప్రభుత్వంతో కలిసి పనిచేశాయి.






