అమెరికాలో ప్రమాదానికి అదే కారణం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొని ముగ్గురు హైదరాబాద్ వాసులు, మరో తమిళనాడు వాసి ప్రాణాలు కోల్పోవడానికి ఓ ట్రక్కు బ్రేకులు విఫలం కావడమే ప్రధాన కారణమని బయటపడింది. డాలస్ సమీపంలోని అన్నా వద్ద చోటు చేసుకున్న ఘటనలో మొత్తం ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి, మృతులు ప్రయాణిస్తున్న ఎస్యూవీ సహా అనే వాహనాలు ఆగి ఉన్నప్పుడు అమిత వేగంతో దూసుకువస్తున్న ట్రక్కు`ఎస్యూవీని వెనక నుంచి బలంగా ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులోని ఆర్యన్ రఘునాథ్ ఓరంపట్టి (కూకట్పల్లి, హైదరాబాద్), ఆయన స్నేహితుడు ఫరూఖ్ షేక్, మరో తెలుగు విద్యార్థి లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శినీ వాసుదేవ్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోవడంతో డీఎన్యే పరీక్షల తర్వాతే మృతులెవరనేది తెలుసుకోగలిగారు.






