TAGS: టీఏజీఎస్ తెలుగు వెలుగు వార్షిక పత్రికకు రచనల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Sacramento: తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి అద్దం పట్టే “శాక్రమెంటో తెలుగు వెలుగు” వార్షిక పత్రిక మూడవ సంచికకు గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) రచనలను ఆహ్వానిస్తోంది. 2023 నుండి వార్షిక పత్రిక రూపంలో వెలువడుతున్న ఈ పత్రిక మూడో సంచికను జనవరి 18, 2026 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు తమ విలువైన రచనలను పంపి, పత్రిక విజయవంతం కావడంలో భాగస్వాములు కావాలని సంపాదక బృందం కోరింది.
పాఠకులను ఆకట్టుకునే వివిధ అంశాలపై రచనలను ఆహ్వానిస్తున్నారు:
సాహిత్యం: కథలు, కవితలు
విజ్ఞానాత్మక రచనలు: వ్యాసాలు (ఆధ్యాత్మికం, పరిశీలన, పరిశోధన, విమర్శ తదితర)
ప్రయాణ విశేషాలు: మీరు సందర్శించిన ప్రాంతాల విశేషాలు, చిత్రాలు
సరదా అంశాలు: పుస్తక పరిచయం, జోక్స్
స్థానిక ప్రతిభ: స్థానిక తెలుగు కుటుంబాలు లేదా వారి పిల్లల ప్రతిభా పాటవాల గురించి వివరాలు
సృజనాత్మకత: పిల్లలు, పెద్దలు వేసిన బొమ్మలు, ఫొటోలు
రచనలు పంపాల్సిన విధానం
రచయితలు తమ రచనలను తెలుగులో టైపు చేయడానికి ఈ క్రింది ఆన్లైన్ సాధనాలను ఉపయోగించవచ్చు:
లేఖిని: http://lekhini.org
గూగుల్ ఇన్పుట్ టూల్: https://www.google.com/intl/te/inputtools/try/
మీ రచనలను పంపవలసిన ఈమెయిల్ చిరునామా: telugusac@yahoo.com.
రచయితలు తప్పనిసరిగా గమనించవలసిన ముఖ్యమైన విషయాలు:
రచనలు అందవలసిన చివరి తేదీ: డిసెంబర్ 20, 2025.
నియమం: అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తారు. సొంత బ్లాగులు, వెబ్సైట్లు లేదా ఇతర పత్రికలలో ఇప్పటికే ప్రచురించబడిన రచనలు పరిగణించరు.
గమనిక: ఇది రచనల పోటీ కాదు, రచయితలకు ఎటువంటి పారితోషికం ఉండదు. రచనలలోని అంశాలకు, అభిప్రాయాలకూ, అచ్చుతప్పులకూ ఆయా రచయితలదే పూర్తి బాధ్యత అని సంపాదక బృందం స్పష్టం చేసింది.
పూర్వ సంచికలు, వార్తాలేఖ నమోదు..
“శాక్రమెంటో తెలుగు వెలుగు” పూర్వ సంచికలను https://sactelugu.org/tags-patrika/ లింక్ ద్వారా చూడవచ్చు.
పత్రిక కొత్త సంచికలు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్‌కు అందాలంటే, ఈ లింక్ ద్వారా TAGS న్యూస్ లెటర్‌కు నమోదు చేసుకోగలరు: https://tinyurl.com/jointags.
– Vishal.B






