TLCA: టీఎల్‌సీఏ నూతన కార్యవర్గం 2026… సుమంత్ రామ్ సెట్టి ఏకగ్రీవ ఎన్నిక
న్యూయార్క్: న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) తమ 2025-26 సంవత్సరానికిగానూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ముఖ్యంగా, ప్రస్తుత అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి తన విశేష సేవలకు గుర్తింపుగా రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గత ఏడాది నిర్వహించిన విభిన్న కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందిన సుమంత్ రామ్ సెట్టి, రాబోయే సంవత్సరంలో సంస్థ పేరు ప్రఖ్యాతులను మరింత పెంచేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
నూతన కార్యవర్గంలో ఇతర ముఖ్య పదవులను చేపట్టిన వారు:
వైస్ ప్రెసిడెంట్: శ్రీనివాస్ సనిగెపల్లి
సెక్రటరీ: లావణ్య అట్లూరి
ట్రెజరర్: సునీల్ చల్లగుల్ల
ఎక్స్ అఫిషియో పాస్ట్ ప్రెసిడెంట్: కిరణ్ రెడ్డి పర్వతాల
జాయింట్ సెక్రటరీ: దివ్య దొమ్మరాజు
జాయింట్ ట్రెజరర్: సుధ మన్నవ
వీరితో పాటు ప్రవీణ్ కరణం, సునీత పోలెపల్లె, శిరీష తూనుగుంట్ల, రజిత కల్లూరి, రాంబాబు జల్లేపల్లి, సాయి దేవినేని కొత్త కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. తనపై విశ్వాసం ఉంచి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బోర్డ్ చైర్, సభ్యులకు సుమంత్ రామ్ సెట్టి ధన్యవాదాలు తెలిపారు.
– Govindarajan






