US Fire Accident: రెండుకు చేరిన మృతుల సంఖ్య.. విషాదం మిగిల్చిన అమెరికా అగ్నిప్రమాదం
న్యూయార్క్: అమెరికాలోని అల్బనీ ప్రాంతంలో ఇటీవలి అగ్నిప్రమాదంలో గాయపడిన మరో భారతీయ యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన అన్వేశ్ అనే విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. సెప్టెంబరు 4న అల్బనీలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న సమీప భవనానికి ఈ మంటలు వ్యాపించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో అంతకుముందే హైదరాబాద్‌కు చెందిన సహజారెడ్డి మరణించినట్లు భారత కాన్సులేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, అన్వేశ్ కూడా మరణించడంతో ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల సంఖ్య రెండుకు చేరింది. మృతుల కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, వారికి అండగా ఉంటామని కాన్సులేట్ హామీ ఇచ్చింది.
– Vishal






