Donald Trump: హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ కు.. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. ఆ రహదారిని ఇకపై డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పిలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ (Telangana)ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలనే ప్రతిపాదన గురించి కేంద్ర విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి (Chief Minister) కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
– NS GOUD






