Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమిట్ (Global Summit) ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీనటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో ఇది కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
– NS GOUD






