Anil Ravipudi: నయనతారను ఎలా ఒప్పించాడో చెప్పిన అనిల్
టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil Ravipudi) ట్రాక్ రికార్డు ఎలాంటిదనేది అందరికీ తెలిసిందే. కళ్యాణ్ రామ్(Kalyan ram) తో మొదలుపెట్టి తర్వాత పలువురు స్టార్ హీరోలను లైన్ లో పెట్టి వారితో సినిమాలు చేసి ఆ సినిమాలతో ఒకదాన్ని మించి మరొకటి హిట్లు అందుకున్న అనిల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad garu) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన అనిల్, సంక్రాంతి కానుకగా ఆ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. నయనతార(Nayanthara)ను హీరోయిన్ గా నటించడమే కాకుండా ఎప్పుడూ లేనిది ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతుంది.
మూవీ ప్రమోషన్స్ కు ఆమడ దూరంలో ఉండే నయనతారను అసలు అనిల్ ప్రమోషన్స్ కోసం ఏం చెప్పి ఒప్పించాడనే అనుమానాలు అందరికీ రాగా, రీసెంట్ గా ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో అనిల్ కు ఎదురైంది. అయితే ఈ విషయంలో తాను చేసిందేమీ లేదని, తాను చాలా క్యాజువల్ గా నయనతార వద్దకు వెళ్లి సినిమా కథ చెప్పి, ఇలా చేద్దామని చెప్పగానే ఆవిడకు ఐడియా నచ్చి వెంటనే ఓకే అన్నారని, ఏదైనా అడిగే విధానంలోనే ఉంటుందని చెప్పాడు.
– Sravani






