మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు గణేశ్ గుప్తా కూడా ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో గత రెండు రోజులుగా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. ఆయన వెంటనే క్వారంటైన్ వెళ్లారు. తొలుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా మహామ్మారి బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది.






