తెలంగాణ పీసీసీ కోశాధికారికి కరోనా పాజిటివ్
తెలంగాణ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కసారిగా ఆయన రుచి, వాసన కోల్పోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఒళ్లు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఎక్కడా ప్రయాణం చేయకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని మురికివాడల్లో పర్యటించి అక్కడ ప్రజలకు మాస్క్లు, శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు నారాయణ రెడ్డి చెప్పారు. దాదాపు వారం, పది రోజుల ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించిని ఎవరినీ తాకకుండానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా తనకు కరోనా సోకిందన్నారు. సామాజిక వ్యాపి దశకు కరోనా చేరి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.






