ఆ మాస్కులతో ఉపయోగం లేదు : అమెరికా
వాల్వులు (చిన్న రంధ్రాలు) కలిగిన ఎన్95 వంటి మాస్కుల ధరించడం వల్ల కోవిడ్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేమని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు తేల్చారు. గాలి ప్రవాహం సులవుగా ఉండేందుకు కొన్ని రకాల మాస్కులు సన్నపాటి రంధ్రాలతో వస్తున్నాయని.. వీటి వల్ల నిర్మాణ రంగంలో పనిచేసేవారికి, ఆస్పత్రులతో కరోనాయేతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఉంటుందని అయితే, కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు అవి అనుకూలమైనవి కాదని తేల్చారు. తుంపరల ద్వారా కరోనా వైరస్ ఫిల్టర్ కాకుండా రావడమే దీనికి కారణమన్నారు. రంధ్రాలు లేని, పొరలతో కూడిన మాస్కులు ధరించడం ఉత్తమమని సూచించారు.






